: నేను మంచి నటిగా పేరు తెచ్చుకున్నాను... నాకు పని కావాలి: బాలీవుడ్ లో కలకలం రేపుతున్న సీనియర్ నటి పోస్టు
'నేను మంచి నటిగా పేరు తెచ్చుకున్నాను...ముంబైలో ఉంటాను... ఎవరైనా పని ఉంటే చెప్పండి' అంటూ సీనియర్ నటి సోషల్ మీడియా ద్వారా అడగడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. సినీ రంగంలో నటీమణుల జీవితకాలం చాలా తక్కువ అనడం వింటూ ఉంటాం. వాటిని నిజం చేసేలా ప్రముఖ సీనియర్ నటి నీనా గుప్తా సోషల్ మీడియాలో చేసిన ప్రకటన పలువుర్ని నివ్వెరపోయేలా చేయగా, మరికొందరికి స్పూర్తి దాయకంగా నిలించింది.
'ఖల్ నాయక్', 'సాధ్ సాథ్', 'గాంధీ', 'భగవద్గీత' వంటి సినిమాలతో పాటు ఎన్నో టీవీ కార్యక్రమాలు నిర్వహించిన నీనా గుప్తా ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఈ నేపథ్యలో తన సోషల్ మీడియా ద్వారా నిర్మాత, దర్శకులకు పని ఉంటే చెప్పండి అంటూ సూచించారు. ఇది బాలీవుడ్ నటులు పలువుర్ని ఆశ్చర్యంలో ముంచెత్తగా, ప్రియాంకా చోప్రా 'స్పూర్తి దాయకం' అంటూ వ్యాఖ్యానించింది.