: సాయి ధరమ్ తేజ్ `జవాన్` టీజర్ విడుదల... మీరూ చూడండి!
బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన `జవాన్` సినిమా టీజర్ విడుదలైంది. `ఇంటికొక్కడు` అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సాయి మిలటరీ సోల్జర్‌గా నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చాడు. దేశమా? కుటుంబమా? అని తేల్చుకోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో తన దేశభక్తిని ఒక సోల్జర్ ఎలా నిరూపిస్తాడనే అంశం నేపథ్యంలో ఈ సినిమా కథ నడవనుంది.