: 'సీఎం పవన్ కల్యాణ్' అంటూ నినాదాలు... వారించిన పవన్ కల్యాణ్!


ప్రజలను చేరుకునేందుకు ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో విధానం అవలంబిస్తాడని పవన్ కల్యాణ్ అన్నారు. అందులో భాగంగా పాదయాత్ర చేసేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీంతో జనసేన కార్యకర్తలు 'సీఎం పవన్ కల్యాణ్' అంటూ నినాదాలు చేశారు. వారిని వారించిన పవన్ కల్యాణ్... పాదయాత్ర అయినా, రోడ్ షో అయినా, సభలు, సమావేశాలు ఏవైనా సరే ప్రజలను చేరే మార్గమేనని స్పష్టం చేశారు. గరగపర్రులో సామాజిక బహిష్కరణ నేరమని ఆయన స్పష్టం చేశారు. మనసులో ఉన్న వేర్పాటు వాద భావజాలాన్ని తెలుసుకోలేమని, అలాంటి వ్యవహార శైలి సమాజానికి ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు వాటి బలాలు వాటికి ఉన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడే ఫలితాలపై వ్యాఖ్యానించడం సరికాదని ఆయన చెప్పారు. తాను ప్రజల్లోకి రాకముందే గెలుస్తానని చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లిన తరువాత ఎంత బరువు భుజాలపై మోయాలో తనకు తెలియదని ఆయన చెప్పారు. తానేవో అద్భుతాలు చేసేస్తానని చెప్పనని, ప్రణాళికాబద్ధంగా పార్టీ నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. తనకు నాయకుడు, రాజకీయ నాయకుడు అవ్వాలని లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలే తనకు ముఖ్యమని అన్నారు. తనను ఎలా పిలవాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News