: ముగిసిన తనీష్ విచారణ...తనీష్ ను సిట్ అడిగిన ప్రశ్నలివే!


టాలీవుడ్ యువనటుడు తనీష్ సిట్ విచారణ ముగిసింది. నోటీసులు జారీ అయిన సమయంలో చెప్పినట్టే సిట్ విచారణకు తనీష్ పూర్తిగా సహకరించాడు. ఉదయం 10:30 నిమిషాలకు హైదరాబాదులోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తనీష్ ను అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. జిషాన్ తెలుసా? జిషాన్ తో ఎంతకాలంగా పరిచయం ఉంది? జిషాన్ ఫోన్ లో నీ నెంబర్ ఎందుకు ఉంది? జిషాన్ డ్రగ్స్ ఇచ్చేవాడా? మీరు డ్రగ్స్ తీసుకున్నారా? డ్రగ్స్ అలవాటు ఎంతకాలంగా ఉంది? పబ్ లు, పార్టీలకు విరివిగా వెళ్తుంటారా? టాలీవుడ్ లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు? డైరెక్టర్ పూరీతో ఉన్న అనుబంధం ఎలాంటిది? జిషాన్ ఇచ్చే డ్రగ్స్ ను పూరీకి చేరవేసేవారా? వంటి ప్రశ్నలు సంధించారు. సుమారు నాలుగు గంటలపాటు తనీష్ ను అధికారులు విచారించడం విశేషం. 

  • Loading...

More Telugu News