naga chaitanya: మరో డిఫరెంట్ రోల్ లో కనిపించనున్న చైతూ!

'ప్రేమమ్'తో యూత్ ను ఆకట్టుకున్న నాగచైతన్య .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరించాడు. 'ప్రేమమ్'లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన ఆయన .. 'రారండోయ్ వేడుక చూద్దాం'లో సివిల్ ఇంజనీర్ గా మెప్పించాడు.

 'యుద్ధం శరణం'తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి వస్తోన్న ఆయన, ఆ తరువాత సినిమాలో యాడ్ ఫిల్మ్ మేకర్ గా కనిపించనున్నాడట. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇది గతంలో నాగ్ చేసిన 'మన్మథుడు' కి సీక్వెల్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 'ప్రేమమ్' తరువాత అదే కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమా, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  
naga chaitanya

More Telugu News