: పట్టపగలు పారిశ్రామిక వేత్త హత్య... సీసీ కెమెరాలో దృశ్యాలు
పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ సభ్యుల ముఠా పట్టపగలే పారిశ్రామిక వేత్తను రివాల్వర్‌తో కాల్చి హత్య చేసింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఫరీద్‌కోట్‌లోని తన మిల్లు ముందే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యజమాని రవీంద్ర పప్పు కొచ్చర్‌ను దుండగులు కాల్చి చంపారు. రోజులాగే మిల్లు వద్దకు కారులో వచ్చిన రవీంద్రను, ఆయన వెనకాలే స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చి గన్‌తో కాల్చారు. నాలుగు సార్లు కాల్చి, చనిపోయాడో లేదో తెలుసుకుని మళ్లీ ఒకసారి కాల్చాడు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు దుండగులు స్థానిక గ్యాంగ్‌స్టర్ బృందానికి చెందినవారుగా గుర్తించారు. గతంలో కూడా రవీంద్రకు ఈ గ్యాంగ్‌స్టర్ల నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ పోలీసులు సరైన రక్షణ కల్పించలేకపోయారని రవీంద్ర సోదరుడు తెలిపాడు.