: జెంటిల్ మెన్ లా మారాలంటే.. ఇదే మీకు సరైన సమయం: కోహ్లీ


మహిళల పట్ల, అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తించే ఈవ్ టీజర్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సందేశం ఇచ్చాడు. ఈ జీవితాన్ని మీకు వారే ఇచ్చారనే విషయాన్ని చెప్పడానికి తాను గర్విస్తున్నానని ట్వీట్ చేశాడు. మహిళల పట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు పట్ల చాలా సిగ్గుపడుతున్నానని చెప్పాడు. ఇది మీ సమయమని... జెంటిల్ మెన్ లా మారడానికి మీకు ఇదే సరైన సమయమని అన్నాడు. ఓ వాచ్ కంపెనీ కోసం రూపొందించిన వీడియోను అప్ లోడ్ చేసిన కోహ్లీ... దానికి క్యాప్షన్ గా 'ఇది మీ సమయం' అని పెట్టాడు. 

  • Loading...

More Telugu News