varun tej: పది రోజుల్లో 'ఫిదా' చేసిన వసూళ్లు

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ప్రభావితం చేసిన సినిమాల్లో 'ఫిదా' ఒకటని చెప్పొచ్చు. కంటెంట్ ఉండాలే గానీ ఒక సినిమా ఏ విధంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. తొలి పది రోజుల వసూళ్లను చూస్తే... ఈ సినిమా ఏ స్థాయి హిట్ ను అందుకుందనేది అర్థమవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి పది రోజుల్లో 31 కోట్ల షేర్ ను, 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల వరకూ రాబట్టడం విశేషం. ఓవర్సీస్ విషయానికే వస్తే... ఈ సినిమా 1.6 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి... 2 మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. ఇంతవరకూ వరుణ్ తేజ్ చేసిన సినిమాల్లో ఇంత మొత్తాన్ని రాబట్టిన సినిమా ఇదేననీ, ఆయన కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని అంటున్నారు. 
Go Back to Shorts
varun tej
sai pallavi

More Telugu News