: నా కామెంట్ల వల్ల విచారణ పక్కదారి పడుతోందని భావిస్తే.. దానికన్నా అవమానం ఉండదు: రాంగోపాల్ వర్మ


టాలీవుడ్ డ్రగ్స్ దందాలో మీ పేరు ఎక్కడ బయటకు వస్తుందన్న ఆలోచనతోనే, సిట్ విచారణపై కామెంట్లు చేస్తున్నారా? అని ఓ టీవీ చానల్ అడిగిన ప్రశ్నకు దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. "అంటే, ఇప్పుడిలా అన్నానని, నా పేరుంటే బయట పెట్టడం మానేస్తారా? రాంగోపాల్ వర్మ అనేవాడెవడో బాంబే నుంచి ఓ మాటనేశాడు అంటే, దాని మూలాన అతన్ని పిలవద్దు అనుకుంటే... అంతకన్నా ఇన్ సల్ట్ ఉండదు నాకు తెలిసి" అన్నాడు.

రవితేజ విచారణకు వచ్చిన సమయంలో మీడియాలో చూపించినంతగా ఆయన డ్రైవర్ వచ్చినప్పుడు చూపించలేదని, అందుకు కారణం ఆయనకున్న ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకేనని వర్మ ఆరోపించాడు. సిట్ ఎంతో మందిని విచారిస్తున్నట్టు పేర్లు చెబుతోందని, వారెవరినీ ఎందుకు చూపించడం లేదని అన్నాడు. తన కామెంట్ల కారణంగా విచారణ పక్కదారి పడుతోందని, వేగం తగ్గుతోందని అనుకుంటే, అంతకు మించి సిట్ కు అవమానం ఉండదని చెప్పాడు. సిట్ అధికారులు వాస్తవంగా ఏం జరుగుతోందో, ఎవరు ఏమి చెబుతున్నారో ఓ అధికార ప్రతినిధిని పెట్టి బయటకు చెప్పాలని డిమాండ్ చేశాడు.

  • Loading...

More Telugu News