maheshbabu: రకుల్ కారణంగా మహేశ్ రొమాంటిక్ సాంగ్ లేట్!

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, రకుల్ జంటగా 'స్పైడర్' చిత్రం రూపొందుతోంది. ఒక సాంగ్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. మహేశ్ - రకుల్ పై ఆ రొమాంటిక్ సాంగ్ ను వచ్చేనెల 2 నుంచి 8వ తేదీ వరకూ 'రొమేనియా'లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తేదీల్లో షూటింగ్ జరగడం లేదనేది తాజా సమాచారం. రకుల్ కి వీసా రాకపోవడమే అందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె అందుకు సంబంధించిన ప్రయత్నాల్లోనే ఉందని అంటున్నారు.

ఆగస్టు 20వ తేదీ తరువాత రొమేనియా వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. దర్శకుడిగా మురుగదాస్ కెరియర్లోను, హీరోగా మహేశ్ బాబు కెరియర్లోను ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనేది అభిమానుల మాట.     
Go Back to Shorts
maheshbabu
rakul

More Telugu News