: ప్రధాని పదవిపై ఇమ్రాన్ కన్ను.. షరీఫ్ రాజీనామాతో ఇస్లామాబాద్‌లో భారీ బహిరంగ సభ.. దేశవ్యాప్త ర్యాలీలు!


పాక్ ప్రధాని పదవి నుంచి షరీఫ్ తప్పుకోవడంలో కీలక పాత్ర పోషించిన మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ దృష్టి ప్రధాని పీఠంపై పడింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పదవిని అధిష్ఠించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, షరీఫ్‌ను గద్దె దింపడంలో కృతకృత్యుడైన ఇమ్రాన్ దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు.

పనామా పేపర్స్‌లో షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు బయటపడినప్పటి నుంచి షరీఫ్‌కు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ పెద్ద ఉద్యమమే నడిపారు. ఆయన రాజీనామా చేయాలంటూ పలుమార్లు డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ దిగ్బంధానికి సైతం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షరీఫ్‌ అవినీతి ఆరోపణల కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు షరీఫ్‌ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News