: అమ్మమ్మ పాత్రలు వేసే నటీమణుల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేస్తున్నారు!: సినీ నటి హేమ
సోషల్ మీడియాలో కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని సినీ నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక టీవీ ఛానెల్ తో ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఇప్పుడు అమ్మమ్మ పాత్రలు వేసే సినీ నటీమణుల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ముఖం ఒకరిది ఉంచి, శరీరం పోర్న్ స్టార్స్ ది ఉంచి మార్ఫింగ్ చేస్తున్నారని తెలిపింది. తల్లి వయసున్న వారిని కూడా వదలడం లేదని చెప్పింది. అలా చేస్తుంటే తమకు కూడా పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించింది.
ఇలాంటి తప్పుడు ప్రచారంతో వారికి మంచి సంబంధాలు వస్తాయా? అని ప్రశ్నించింది. ఏదో కేవలం సినీ పరిశ్రమలో ఉన్నవారే తప్పులు చేస్తున్నట్టు రాస్తుంటారని, ఇతర రంగాల్లో ఉన్నవారు తప్పులు చేయరా? అని ప్రశ్నించింది. 'ఇకపై సోషల్ మీడియాలో ఎవరైనా అమ్మాయి ఫోటో పెట్టాలన్నా, హీరోయిన్ గురించి రాయాలన్నా పేంటు తడవాలి నా కొడుక్కి... దీనిపై పోరాడుతున్నా... ఒక రోజు నన్ను అంతా శభాష్ హేమ అంటారు' అని తెలిపింది.