: పోసానికి అంత ఇంగ్లిష్ వచ్చని భావించడం లేదు: వర్మ

ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళికి తన ట్వీట్లు చదివి అర్థం చేసుకునేంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటుందని తాను భావించడం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. డ్రగ్స్ ఆరోపణలపై సినీ పరిశ్రమలోని వారిని విచారించడంపై వర్మ వ్యాఖ్యలకు విరుద్ధమైన అభిప్రాయాన్ని పోసాని కృష్ణమురళి వ్యక్తం చేయడంపై వర్మ స్పందిస్తూ, ఆయన ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాడో తెలియదు కనుక దానిపై తాను మాట్లాడనని అన్నారు.

డ్రగ్స్ తీసుకున్నవారు బాధితులని తాను చెబుతున్నానని, అయితే దానిపై సిట్ అధికారులు మాట్లాడాల్సి ఉంటుందని, అలా మాట్లాడకపోవడంతోనే తాను స్పందించానని ఆయన తెలిపారు. తాను సిట్ ను ప్రశ్నించలేదని, తనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశానని వర్మ అన్నారు. కాగా, సిట్ సినీ ప్రముఖులను విచారించిన సందర్భంగా వారిని దోషులుగా చూస్తోందని, సిట్ కు మానవత్వం లేదని, సినీ ప్రముఖుల పేరు ప్రతిష్ఠలకు భంగం కలుగుతోందని వర్మ పేర్కొనగా, సిట్ దర్యాప్తుకు సహకరించడం పౌరుడిగా ప్రతిఒక్కరి హక్కు అని, సినిమా వాళ్లు తప్పు చేయనప్పుడు సిట్ విచారణకు వెళ్లడాన్ని పరువు నష్టంగా ఎందుకు భావించాలని పోసాని ప్రశ్నించారు. 

More Telugu News