: ఫిదా సినిమాలో నాకు నచ్చిన సన్నివేశమిదే... అప్పుడు మా చెల్లి గుర్తొచ్చింది!: వరుణ్ తేజ్

ఫిదా సినిమాలో తనకు బాగా నచ్చిన సన్నివేశం ఏదంటే... సాయిపల్లవి తన తండ్రి చేతిని పట్టుకుని... 'నాన్నా! ఇకపై నేను నీ కొడుకుని, నీతోనేే ఉంటాను. నేనెక్కడికీ వెళ్లను' అంటూ చెప్పే సన్నివేశం తన ఫేవరేట్ సన్నివేశమని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. ఆ సన్నివేశం ఎందుకు తన ఫేవరేట్ అంటే... మా నాన్నతో కూర్చుని, ఆయన భుజంపై తలపెట్టి అలాగే తన చెల్లెలు నిహారిక కూడా చెబుతుంటుందని అన్నాడు. అలా ఏ కూతురు చెప్పినా తండ్రి ఫిదా అయిపోతాడని చెప్పాడు. అలాగే, ఏ అన్న, తమ్ముడైనా కూడా ఆ మాటలకు ఫిదా అయిపోతారని అన్నాడు. ప్రతి ఇంట్లో జరిగే ఆ సన్నివేశం తనకు చాలా ఇష్టమని.. ఈ రోజు ఓ టీవీ చానెల్ తో జరిపిన ఇంటర్వ్యూలో వరుణ్ చెప్పాడు.

వెంటనే పక్కనే వున్న దిల్ రాజు కల్పించుకుని... 'ఈ సినిమాలో ఈ పాత్రకు వరుణ్ కాకపోతే ఎవరిని ఎంపిక చేసుకునేవార'ని శేఖర్ కమ్ములను ప్రశ్నించారు. వెంటనే ఆయన అందుకుని 'నాకు హీరో అంటే పవన్ కల్యాణే'నని తెలిపాడు. 'ఆయన ఇన్ ఫ్లుయెన్స్ ఈ పాత్రపై ఉంటుంద'ని చెప్పాడు. 'తొలిప్రేమ', 'ఖుషీ' వంటి సినిమాల ప్రభావం ఉంటుందని అన్నాడు. వెంటనే వరుణ్ కల్పించుకుని... 'అయితే, బాబాయి కోసం రూపొందించిన పాత్రలో నేను నటించానా? వాహ్.. అంతకంటే ఏం కావాలి?' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

More Telugu News