: ‘హీరో’ అని రాసున్న టీ షర్టులు ధరించారని టర్కీలో 20 మంది అరెస్ట్!
హీరో అని రాసి ఉన్న టీషర్టులు ధరించిన నేరానికి 20 మందిని టర్కీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తెల్లని టీషర్టుపై నల్లని అక్షరాలతో రాసి ఉన్న ఈ టీషర్టులను ధరించిన అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీషర్టులు ధరించిన వీరంతా అమెరికాకు చెందిన మతపెద్ద ఫెతుల్లా గులెన్‌కు మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. గతేడాది టర్కీ అధ్యక్షుడు తయ్యపి రెసెప్ ఎర్డోగాన్ ప్రభుత్వంపై జరిగిన సైనిక తిరుగుబాటులో గులెన్ హస్తం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.