prabahs: ఆగస్టు 15న 'సాహో' నుంచి స్పెషల్ లుక్?
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఆయన లుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదట్లో ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్ ను .. టీజర్ ను వదిలారు. ఆ తరువాత నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. అందుకు కారణం ప్రభాస్ లుక్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడమేనని అంటున్నారు. ఇంకా రకరకాల లుక్స్ ట్రై చేసే పనిలోనే ఉన్నారట. అయితే సాధ్యమైనంత త్వరలో ఆయన లుక్ ను ఖరారు చేసి .. ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎదురుచూడాల్సిందే.