allu arjun: బన్నీ మూవీ విషయంలో వక్కంతం వంశీకి టెన్షన్ తప్పదేమో!

తెలుగులో క్రేజ్ వున్న సినీ కథా రచయితలలో వక్కంతం వంశీ ఒకరు. కథను అనూహ్యమైన మలుపులు తిప్పుతూ ప్రేక్షకులలో ఉత్కంఠను కలిగించడం ఆయన ప్రత్యేకత. కథా రచయితగా స్టార్ హీరోల సినిమాలకి పనిచేసిన ఆయన, త్వరలో అల్లు అర్జున్ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నాడు.

 అలాంటి వక్కంతం వంశీపై ఈ సినిమా ఒత్తిడిని పెంచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'డీజే' అల్లు అర్జున్ కి గల క్రేజ్ స్థాయిలో అలరించలేకపోవడమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. బన్నీకి కూడా ఆ సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయిందట. దాంతో సహజంగానే ఈ సినిమాపై బన్నీ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఆయన చూపించే చొరవ వక్కంతం వంశీని టెన్షన్ పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
allu arjun

More Telugu News