: ఇప్పుడు అఖిలేష్ వంతు.. షాకిస్తున్న పార్టీ నేతలు!


ప్రతి రాష్ట్రంలో తన పట్టును మరింత పెంచుకునేందుకు బీజేపీ యత్నిస్తోంది. గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి క్యూ కడుతుంటే... వారిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్థితి సమాజ్ వాదీ పార్టీకి ఎదురైంది. యూపీలో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ... ఎస్పీలో ఉన్న నేతలను లాగే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు షాకిస్తూ ఆ పార్టీకి ఎమ్మెల్సీ యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. అంతేకాదు, రాజీనామా బాటలో మరింతమంది ఎస్పీ నేతలు ఉన్నారని బాంబు పేల్చారు. ఎస్పీకి చెందిన మరో ఎమ్మెల్సీ, రాష్ట్రీయ షియా సమాజ్ ఫౌండర్ బుక్కాల్ నవాబ్ కూడా ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై ఆయన ప్రశంసలు కురిపించారు. 

  • Loading...

More Telugu News