sai pallavi: భారీ మొత్తం అడ్వాన్స్ గా ఇస్తామన్నా సాయిపల్లవి తీసుకోవడం లేదట!

షార్ట్స్‌లో చూడండి
'ఫిదా' సినిమా హిట్ తో సాయిపల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. తమ ప్రాజెక్టును ఓకే చేయమంటూ భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. కానీ సాయిపల్లవి మాత్రం కొత్తగా ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదట.

తనకి డబ్బే ప్రధానమని అనుకుంటే మలయాళంలో ఈ పాటికే చాలా సినిమాలు చేసి వుండేదానిననీ, పది కాలాల పాటు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నానని అంటోందట. అలాంటి పాత్రలు వస్తే చేయడానికి తానే ఆసక్తి చూపుతానని చెబుతోంది. పారితోషికమనేది తనకి ఎప్పటికీ ప్రధానం కాదని స్పష్టం చేసింది. క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచన లేని ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని చూసి దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట.   
Go Back to Shorts
sai pallavi

More Telugu News