: సెల్ఫీ తీసుకుంటుండ‌గా తొక్కి చంపిన ఏనుగు!

సెల్ఫీ కోసం ప్ర‌యాస‌లు ప‌డి, చివ‌రికి మృత్యువాత ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. బెంగ‌ళూరులోని బ‌న్నేర్‌ఘ‌ట్ట బ‌యోలాజిక‌ల్ పార్క్‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. పార్కులోకి దొంగ‌త‌నంగా ప్ర‌వేశించి, ఏనుగుతో సెల్ఫీ దిగ‌డానికి ప్ర‌య‌త్నించిన యువ‌కుణ్ని ఏనుగు తొక్కి చంపేసింది.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం మంగ‌ళ‌వారం పార్కుకి సెల‌వుదినమైనా అభిలాష్‌, అత‌ని స్నేహితులు గోడ దూకి పార్కులో ప్ర‌వేశించారు. బైక్ ద‌గ్గ‌ర ఇద్ద‌రు స్నేహితులు ఎదురుచూస్తుండ‌గా, సుంద‌ర్ అనే ఏనుగుతో అభిలాష్ సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో బెదిరిపోయిన ఏనుగు అభిలాష్ మీద‌ దాడి చేసి చంపేసింది. మృత‌దేహాన్ని గుర్తించిన అభిలాష్ త‌ల్లిదండ్రులు పార్క్ ర‌క్ష‌ణ సిబ్బందిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

More Telugu News