nayanatara: ప్రతీకారం తీర్చుకునే యువతిగా నయనతార!

ఒక స్థాయి వరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను చేస్తూ వచ్చిన నయనతార, ఆ తరువాత నటనకి స్కోప్ వుండే పాత్రలనే ఎంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను ఒప్పేసుకుంటోంది. తమిళంలో తన హావాను కొనసాగిస్తోన్న నయనతార, మలయాళంలోనూ తన సత్తా చాటుతోంది. అలా మలయాళంలో ఆమె 'పుదియ నియమం'అనే సినిమా చేసింది.

 సాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో 'వాసుకి' పేరుతో ఈ సినిమాను తెలుగులో ఈ రోజున విడుదల చేశారు. మమ్ముట్టి భార్య వాసుకి గా .. కథక్ డాన్సర్ గా .. నిండైన పాత్రలో ఈ సినిమాలో నయనతార నటించిందని అంటున్నారు. అఘాయిత్యం చేయబడి .. ప్రతీకారం తీర్చుకునే స్త్రీగా ఆమె అద్భుతంగా మెప్పించిందని చెబుతున్నారు. వాసుకిగా నయనతార పలికించిన హావభావాలు సూపర్బ్ అంటూ కితాబునిస్తున్నారు.
nayanatara

More Telugu News