: అవకాశమున్నా ఫాలో ఆన్ ఇవ్వని భారత్... 291 పరుగులకు లంక ఆలౌట్!


గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజున శ్రీలంక జట్టు 291 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులు చేసిన భారత జట్టు, లంకను ఫాలో ఆన్ ఆడించే అవకాశాలు ఉన్నప్పటికీ, వారిని రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించకుండా, మరికొన్ని పరుగులను జోడించాలని నిర్ణయించుకుంది. అంతకుముందు పెరీరా చేసిన ఒంటరి పోరును వృథా చేస్తూ, మిగతా బ్యాట్స్ మెన్స్ అంతా స్వల్ప స్కోరుకే పెవీలియన్ దారి పట్టారు.

పెరీరా మాత్రం 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజాకు 3, షమీకి 2, యాదవ్, అశ్విన్, పాండ్యాలకు తలో వికెట్ లభించాయి. మరికాసేపట్లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, అభినవ్ ముకుంద్ లు రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు రానున్నారు. ఈ మ్యాచ్ లో కనీసం మరో 150 పరుగులు చేసి పటిష్ఠమైన స్కోరుకు చేరుకున్న తరువాత లంకను రెండో ఇన్నింగ్స్ కు ఆహ్వానించాలన్నది భారత ఆలోచనగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News