: ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమట... సీఎం ఎవరో కూడా తెలియని స్థితిలో తమిళ ఇంటర్ అమ్మాయిలు!
అది చెన్నైలోని తిరువణ్ణామలై జిల్లా సెయ్యూరు సమీపంలోని పెరుంకాట్టూర్ తెన్ కేళి గ్రామం. అక్కడి ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో దాదాపు 500 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఆ పాఠశాలలో వసతులు సరిగ్గా లేవని, ఉపాధ్యాయులు రావడం లేదని స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందగా, అక్కడికి తనిఖీలకు వెళ్లిన ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇంటర్ విద్యార్థినులకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. ఓ క్లాసుకు వెళ్లి, విద్యార్థినులతో ముచ్చట పెట్టిన ఆయన, దేశ రాష్ట్రపతి ఎవరని తొలుత ప్రశ్నించారు. దానికి ఒక్కరంటే, ఒక్కరి నుంచి కూడా సమాధానం రాలేదు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరని ప్రశ్నించగా, ఓ బాలిక నిలబడి ఓ పన్నీర్ సెల్వం అని సమాధానం ఇవ్వడంతో సదరు ఎమ్మెల్యే అవాక్కయ్యాడు. చేసేదేమీ లేక, విద్యార్థినులకు జనరల్ నాలెడ్జ్ బోధించాలని చెప్పి వెనక్కు వచ్చేశారు.