varun tej. sai pallavi: 'ఫిదా' విషయంలో వరుణ్ తేజ్ ఫీలవుతున్నాడట!

కొంత గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల .. ఆ సమయాన్ని వృథా చేయలేదనే విషయం 'ఫిదా' హిట్ తో స్పష్టమైంది. కథ .. కథనాలను నడిపించిన తీరు, పాత్రలను అత్యంత సహజంగా మలిచిన తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'భానుమతి'గా సాయిపల్లవి .. వరుణ్ తేజ్ ను డామినేట్ చేసిందనీ, దాంతో తనకి రావాల్సినన్ని మార్కులు రాలేదని వరుణ్ తేజ్ ఫీలవుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది.

అయితే కథ వింటున్నప్పుడే తన పాత్ర కంటే సాయిపల్లవి పాత్ర జనంలోకి బాగా వెళుతుందని వరుణ్ తేజ్ కి తెలుసు. ఆమె నటన అద్భుతమంటూ ఆయన స్టేజ్ పై కూడా చెప్పాడు. కథ తన చుట్టూ మాత్రమే తిరగాలి .. తన పాత్ర మాత్రమే ఆడియన్స్ పై ప్రభావం చూపాలని అనుకునే రకం కాదు వరుణ్ తేజ్. కథలో భాగం కావడానికి .. ఆ కథలో కలిసిపోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ఆ రకంగా చూసుకుంటే పాత్ర పరిథిలో వరుణ్ తేజ్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు.
varun tej. sai pallavi

More Telugu News