aishwarya lakshmi: తెలుగు తెరకు మరో మలయాళీ భామ!

తెలుగు తెరపై మలయాళీ భామల హవా కొనసాగుతోంది. అక్కడ కొత్తగా వచ్చిన అమ్మాయిలను ఇక్కడ పరిచయం చేయడానికి తెలుగు దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ .. సాయిపల్లవి అలా తెలుగు తెరపై ప్రత్యక్షమైనవారే .. సక్సెస్ లు అందుకుంటున్న వారే. అలా మరో మలయాళీ భామ తెలుగు తెరపైకి వస్తోంది .. ఆ అమ్మాయి పేరు 'ఐశ్వర్య లక్ష్మి'.

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రం ద్వారా అనుపమ పరమేశ్వరన్ కి .. సాయి పల్లవికి క్రేజ్ తెచ్చిన దర్శకుడు ఆల్తాఫ్ .. మూవీలోనే ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఎం.ఎల్.ఎ. తరువాత తాను చేయనున్న సినిమా కోసం కల్యాణ్ రామ్ ఈ అమ్మాయిని తీసుకున్నాడని సమాచారం. మరో ఇద్దరు .. ముగ్గురు తెలుగు దర్శకులు కూడా ఈ అమ్మాయిని సంప్రదిస్తున్నారట. ఇక ఈ అమ్మాయి ఇక్కడ ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.   
aishwarya lakshmi

More Telugu News