: కాల్పుల ఘటనపై విక్రమ్ భార్య ఫిర్యాదు.. ఆ సమయంలో తాను పై గదిలో ఉన్నానన్న శిల్పాలి!
విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారంపై ఆయన భార్య శిల్పాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్పులు జరిగిన సమయంలో తాను పిల్లలతో కలిసి పై గదిలో ఉన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగంతుకులు గదిలోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోందన్నారు. తామిద్దరం పూజకు వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. తుపాకి చప్పుడు విని తాను కిందికి వచ్చానని, అప్పటికే విక్రమ్ రక్తపు మడుగులో కిందపడి ఉన్నారని, వెంటనే ఆస్పత్రికి తరలించానని వివరించారు. తాను, భర్త వేర్వేరుగా ఉంటున్నట్టు శిల్పాలి పేర్కొన్నారు.