: ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక...భారత బౌలర్ల ప్రతిభ
టీమిండియా బౌలర్లు అద్భుతమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేస్తున్నారు. 600 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ అధిగమించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాకిస్తూ, ఓపెనర్ కరుణ రత్నే (2) వికెట్ ను ఉమేష్ యాదవ్ ఖాతాలో వేసుకోగా, తరువాత అర్ధసెంచరీతో రాణించిన తరంగను (64) రన్ అవుట్ చేసి ముకుంద్ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత గుణ తిలక (16), మెండిస్ (0) ను స్టార్ పేసర్ మహ్మద్ షమీ పెవిలియన్ కు పంపాడు. కీపర్ డిక్ వెల్లా (8) ను ముకుంద్ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. దీంతో 150 పరుగులకు కీలకమైన ఐదు వికెట్లను శ్రీలంక జట్టు కోల్పోయింది. అర్ధసెంచరీతో టీమిండియా బౌలర్లను సీనియర్ ఆటగాడు మాథ్యూస్ (53) అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, దిల్ రువాన్ (3) అతనికి సహకరిస్తున్నాడు. టీమిండియా బౌలర్లలో రెండు వికెట్లతో షమీ ఆకట్టుకోగా, ఉమేష్ యాదవ్, రవి చంద్రన్ అశ్విన్ చెరొక వికెట్ తీశారు.