: చూసింది... పట్టేసింది... చేసేసింది... వైరల్ అయింది!
రెండేళ్ల పాపను వాళ్లమ్మ జిమ్‌కి తీసుకెళ్లింది. అక్కడ వాళ్లు చేస్తున్న ఎక్సర్‌సైజులను తీక్షణంగా గమనించింది. ఇంటికొచ్చిన తర్వాత సరిగ్గా వాళ్లలాగే చేయడం మొదలుపెట్టింది. ఇంకేం.. పాప చూపిస్తున్న ఆసక్తికి వాళ్లమ్మ ఇంకాస్త తర్ఫీదునిచ్చింది. తర్వాత పాప చేస్తున్న బర్పీ జంప్‌లను వీడియో తీసి ఇన్‌స్టాగ్రాంలో పెట్టేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాప పేరు కీలీ. వాళ్లమ్మ పేరు యాష్లీ రాబర్ట్స్. ఈమె ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తోంది. అందుకే తరచుగా కీలీని జిమ్‌కి తీసుకెళ్తుంటుంది. అలా సరదాగా తాను పోస్ట్ చేసిన వీడియో, ఇలా వైరల్ అవుతుందని అస్సలు ఊహించలేదని యాష్లీ తెలిపారు. ప్రతి ఒక్కరు కీలీ చేసిన ఫీట్‌ను చూసి అభినందిస్తున్నారని ఆమె చెప్పారు.