: శ్రుతి హాసన్ బాయ్‌ఫ్రెండ్ ఇతడేనా?
తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లోనూ నటిస్తున్న శ్రుతి హాసన్ వృత్తిగత జీవిత విషయాల కంటే వ్యక్తిగత విషయాల వల్లే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య లండన్‌కు చెందిన ఓ నటుడితో తను రెండు మూడు సార్లు కెమెరా కంటికి చిక్కింది. ఇంకేం... ఇతడే శ్రుతి హాసన్ బాయ్‌ఫ్రెండ్ అంటూ పుకార్లు పుట్టించేశారు. ఈ కామెంట్లపై శ్రుతి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా మళ్లీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ కనిపించడంతో పుకార్లను నిజం చేసినట్లైంది. బ్రిటీష్ నటుడు మైకేల్ కోర్సాలేతో కలిసి శ్రుతిహాసన్ మే నెలలో జరిగిన కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి `శభాష్ నాయుడు` సినిమాలో నటిస్తోంది. కొన్ని కారణాల దృష్ట్యా శ్రుతి హాసన్‌ను ప్రతిష్టాత్మక `సంఘమిత్ర` సినిమా నుంచి తొలగించిన విషయం తెలిసిందే!