: ఎల్లుండే నితీశ్ బలం నిరూపించుకోవాలి: ఆదేశించిన బీహార్ గవర్నర్


మహా ఘటబంధన్ ను బద్దలు కొట్టి, బీజేపీతో చేతులు కలిపి, నేడు ఆరవ విడత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జనతాదళ్ (యు) అధినేత నితీశ్ కుమార్, ఎల్లుండి శనివారం నాడు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి ఆదేశించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత రెండు రోజుల్లోనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, తన బలాన్ని చూపాలని ఆయన కోరారు. అంతకుముందు తేజస్వి యాదవ్ ఆయన్ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అనుమతించాలని కోరగా, ఇప్పటికే సంఖ్యాబలాన్ని చూపినందున ఆయన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించానని, అందువల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేనని త్రిపాఠి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, బల నిరూపణకు ఎక్కువ రోజులు గడువు ఇవ్వబోనని ఆయన చెప్పడంతో, ఇక చేసేదేమీ లేక తేజస్వి బయటకు వచ్చేశారు.

  • Loading...

More Telugu News