sai dharam tej: చిరూ మూవీ టైటిల్ తో సాయిధరమ్ తేజ్!

దూకుడు చూపిస్తోన్న తెలుగు యువ కథానాయకులలో సాయిధరమ్ తేజ్ కూడా ముందువరుసలోనే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత ఆయన వినాయక్ .. కరుణాకరన్ ల ప్రాజెక్టులు చేయనున్నాడు.

 ఆ తరువాత సినిమాను కూడా సాయిధరమ్ తేజ్ ప్లాన్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాకి మారుతి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరూకి హిట్ ఇచ్చిన  'మహానగరంలో మాయగాడు' టైటిల్ నే, ఈ సినిమాకి ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. చిరూ రీమిక్స్ సాంగ్స్ తో మాస్ ఆడియన్స్ మనసు దోచేసిన సాయిధరమ్ తేజ్ .. ఆయన టైటిల్ తో వస్తుండటాన్ని ప్రేక్షకులు ప్రత్యేకంగానే భావించే అవకాశం వుంది.
sai dharam tej

More Telugu News