: నా కొడుకు రాజీనామా చేయడు.. ధైర్యం ఉంటే మాతో బంధం తెంచుకో: నితీష్ కు లాలూ సవాల్

బీహార్ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. రాజకీయ సంక్షోభం తార స్థాయికి చేరుకుంది. అధికారపక్షంలో భాగస్వాములైన జేడీయూ, ఆర్జేడీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (లాలూ కుమారుడు) రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో లాలూ మాట్లాడుతూ, నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని అన్నారు. తన కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, నితీష్ కు దమ్ముంటే తమ పార్టీతో బంధం తెంచుకోవాలని సవాల్ విసిరారు.

More Telugu News