maheshbabu: 'స్పైడర్' బిజినెస్ 200 కోట్లు?

షార్ట్స్‌లో చూడండి
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమా 100 కోట్ల బిజినెస్ చేస్తుందనగానే అంతా ఆశ్చర్యంగా చూసేవాళ్లు. అలాంటి తెలుగు సినిమా 200 కోట్ల మార్క్ ను చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం విశేషం. మహేశ్ బాబు తాజా చిత్రం 'స్పైడర్' ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల వరకూ తెచ్చిపెడుతుండగా .. తమిళ వెర్షన్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు 23 కోట్లకి సొంతం చేసుకున్నారు.

 ఇక హిందీ .. మలయాళ వెర్షన్స్ కి సంబంధించిన హక్కులు 25 కోట్లవరకూ పోయే అవకాశాలు వున్నాయట.  అన్ని భాషలకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ 26 కోట్లవరకూ వచ్చాయని అంటున్నారు. ఆడియోతో పాటు మిగతా హక్కులను కలుపుకుంటే .. 200 కోట్ల వరకూ బిజినెస్ అవుతున్నట్టుగా తెలుస్తోందని చెబుతున్నారు. ఒక్క 'బాహుబలి'ని మినహా ఇస్తే మరే సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసింది లేదని అంటున్నారు.
Go Back to Shorts
maheshbabu
rakul

More Telugu News