: తన సినిమాల్లో స్క్రిప్టు డిమాండ్ చేసినా ముద్దు సన్నివేశాలు ఉండవంటున్న బాలీవుడ్ దర్శకుడు
తన సినిమాల్లో స్క్రిప్టు డిమాండ్ చేసినా ముద్దు సన్నివేశాలు మాత్రం ఉండవని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీ తెలిపారు. 'నో ఎంట్రీ', 'వెల్ కమ్', 'సింగ్ ఈజ్ కింగ్', 'రెడీ', 'వెల్ కమ్ బ్యాక్' వంటి సినిమాలు తీసిన అనీస్ బాజ్మీ తాజాగా అర్జున్ కపూర్, అనిల్ కపూర్, ఇలియానా, అథియా శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ముబారకన్' సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సినిమాల్లో ముద్దు సన్నివేశాలు పెట్టనని అన్నాడు. తన ఇంట్లో తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తె ఉంటారని, వారందరితో కలిసి చూసే విధంగా సినిమాలు రూపొందిస్తానని చెప్పాడు. సినిమా అంటే భారతదేశంలో ఇప్పటికీ ఓ ఫ్యామిలీ ఈవెంట్ లాంటిదేనని, అందుకు తన కుటుంబం ముందు పరువు పోయే సినిమాలు రూపొందించనని స్పష్టం చేశాడు.