: ఎయిర్ హోస్టెస్ గానే కొనసాగుతానంటున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కుమార్తె
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగిగా కొనసాగుతానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి తెలిపారు. ఢిల్లీలో మాట్లాడుతూ, ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయలో తన విద్యాభ్యాసం జరిగిందని, ఆ తరవాత కళాశాల విద్య లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తైందని ఆమె చెప్పారు. తన తండ్రి చాలా కష్టపడి పని చేసేవారని ఆమె అన్నారు. ఆ కష్టమే ఆయనను నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆమె అన్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని అందరికీ ఆయన చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. తన ఉద్యోగ మార్పు ఆలోచన లేదని, ఎయిరిండియా ఎయిర్ హోస్టెస్ గానే కొనసాగుతానని ఆమె వివరించారు. కాగా, ఎయిరిండియాలో ఆమె క్యాబిన్ సూపర్ వైజర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఆయన రాష్ట్రపతి అయ్యేవరకు ఎయిరిండియాకు ఆమె ఎవరో తెలియకపోవడం విశేషం. లీవ్ పెట్టే సమయంలో ఎందుకు సెలవు కావాలో చెప్పక తప్పాల్సిన పరిస్థితుల్లో ఆమె తనతండ్రి గురించిన వాస్తవం వెల్లడించడంతో ఎయిరిండియా, ఆమె సహోద్యోగులకు ఆమె రాష్ట్రపతి కుమార్తె అన్న సంగతి తెలిసింది.