: 'వైట్ సెంటిమెంట్'ను పట్టించుకోని హీరోయిన్ చార్మి!
టాలీవుడ్ మత్తు బాగోతంలో భాగంగా సిట్ విచారణను ఎదుర్కొంటున్న వారి 'వైట్ సెంటిమెంట్'ను చార్మీ పక్కనబెట్టింది. తొలి రోజున విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్ నుంచి, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, చిన్నా తదితరులంతా వైట్ షర్ట్ వేసుకుని విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మీడియాలో ఆసక్తికర కథనాలూ వచ్చాయి. తాము నిరపరాధులమని, తప్పు చేయలేదన్న సంకేతాలు ఇచ్చేందుకు వారు తెలుపు రంగును ఆశ్రయించారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. నిజాయతీకి, స్వచ్ఛతకు సంకేతమైన తెలుపు రంగు దుస్తులనే చార్మి కూడా ధరించి వస్తుందని అందరూ భావించగా, ఆమె మాత్రం బ్లూ కలర్ టాప్ ధరించి వచ్చిన సంగతి తెలిసిందే.