balakrishna: బాలకృష్ణ సినిమాతో మొదలైన కొత్త ప్రక్రియ 'స్టంపర్'!

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ 101వ సినిమాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ సినిమా మొదటి లక్షణమే భారీతనం. ఆయన సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ .. మసాలా సాంగ్స్ .. భారీ యాక్షన్ సీన్స్ ను .. అదిరిపోయే డాన్సులను అభిమానులు కోరుకుంటారు. అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా వుంటాయని తాజాగా పూరీ జగన్నాథ్ చెప్పాడు.

 బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఎలాంటి పరిస్థితుల్లో అసంతృప్తిని కలిగించని విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన అన్నాడు. ఇదే విషయాన్ని ఈ నెల 28వ తేదీన రిలీజ్ చేయనున్న 'స్టంపర్' లో ఆయన చూపించనున్నాడట. టీజర్ కి ఎక్కువ .. ట్రైలర్ కి తక్కువగా వుండే మధ్యస్థ దశకు 'స్టంపర్' అనే పేరు పెట్టారట. ఈ కొత్త ప్రక్రియ బాలకృష్ణ సినిమా నుంచే మొదలవుతోందన్న మాట. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
Go Back to Shorts
balakrishna
shriya

More Telugu News