: ఛార్మి విచారణలో సిట్ బయటపెట్టనున్నవి ఇవే...!


హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి ఛార్మీని సిట్ ఎలా విచారించనుందన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. అయితే ఛార్మీ విచారణ ఇప్పటి వరకు జరిగిన విచారణలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. సిట్ విచారణకు మానసికంగా పూర్తి సన్నద్ధంగా రానున్న ఛార్మీ నుంచి నిజాలు రాబట్టేందుకు సిట్ అధికారులు వ్యూహాత్మకంగా ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పూరీ జగన్నాథ్‌ తో కలసి డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా ఉన్న ఆధారాలను ఆమె ముందు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా, కెల్విన్ తో ఆమె జరిపిన వాట్స్ యాప్ సంభాషణలు, ఫోన్ వివరాలను ఆమె ముందు ఉంచనున్నారు. అలాగే అతనితో దిగిన ఫోటోలను కూడా ఆమెకు చూపించి విచారించనున్నారు. అయితే వీటన్నింటికీ ఆమె వ్యూహాత్మకంగా మౌనాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె విచారణ ఒక్క రోజులోనే పూర్తవుతుందా? లేక విచారణ మరో రోజుకు పొడిగింపబడుతుందా? అన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది. ఛార్మీని విచారించేందుకు అనుభవజ్ఞులైన మహిళా అధికారిణులను సిట్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News