: ముంబై చేరుకున్న టీమిండియా మహిళా జట్టు.. కేరింతలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు!


మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరుకుని తృటిలో కప్ చేజార్చుకున్న మిథాలీ సేనకు ముంబై విమానాశ్రయంలో బుధవారం తెల్లవారుజామున ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు, డ్యాన్స్‌లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. జట్టు సభ్యులను చూడగా ‘ఇండియా’, ‘ఇండియా’ అంటూ నినాదాలు చేశారు.

కుమార్తెల రాక కోసం క్రికెటర్ల కుటుంబ సభ్యులు ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తం 8మంది ప్లేయర్లు ముంబై చేరుకున్నారు. వీరిలో హర్మన్‌ప్రీత్ కౌర్, ఝులన్ గోస్వామి, సుష్మా వర్మ, స్మృతి మందన, శిఖాపాండే, పూనమ్ రౌత్, దీప్తి శర్మ ఉన్నారు. క్రికెటర్ల నుదుట తిలకం దిద్ది, మెడలో దండలు వేసి ఆహ్వానం పలికారు. ‘ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్కమ్స్ ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్’ అని కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు.  

  • Loading...

More Telugu News