: రాష్ట్రపతి కార్యాలయంలోని అధికారులంతా మోదీ వీరవిధేయులే!

దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ప్రథమ పౌరుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన కోవింద్ కు సీనియర్ అధికార్లుగా సంజయ్ కొఠారి, భరత్ లాల్, అశోక్ మాలిక్ లను కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ నియమించింది. వీరు ముగ్గురు కూడా ప్రధాని మోదీకి అత్యంత విధేయులు కావడం గమనార్హం.

రాష్ట్రపతికి సెక్రటరీగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంజయ్ కొఠారీని నియమించారు. మోదీ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న పీకే మిశ్రాకు కొఠారి అత్యంత సన్నిహితుడు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు చెందిన భరత్ లాల్ ను రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఈయన గుజరాత్ కు చెందినవారు. గుజరాత్ రెసిడెంట్ కమిషనర్ గా ఆయన 2010 నుంచి 2014 వరకు పని చేశారు. మోదీ ప్రధాని అయిన వెంటనే ఆయన్ను ఢిల్లీకి రప్పించుకున్నారు.

రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీగా అశోక్ మాలిక్ ను నియమించారు. జర్నలిస్ట్ అయిన మాలిక్ మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడనే విషయం మీడియా వర్గాలకు తెలుసు. ప్రధాని కార్యాలయం సిఫారసుల మేరకే ఈ ముగ్గురి నియామకం జరిగింది. 

More Telugu News