: జియో వినియోగదారుల్లో ఏపీ ఫస్ట్.. ఆ తర్వాత గుజరాత్!


రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల విషయంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 1.06 కోట్ల మంది వినియోగదారులతో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తొలి స్థానంలో నిలవగా 90.1 లక్షలతో గుజరాత్ రెండోస్థానం దక్కించుకుంది. 90 లక్షల మంది వినియోగదారులతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 80.4 లక్షలతో ఢిల్లీ, 50.6లక్షలతో ముంబై వరుసగా ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.
జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి జియోకు కొత్తగా 1.4కోట్ల మంది వినియోగదారులు చేరారు.

దీంతో జియో వినియోగదారుల మొత్తం సంఖ్య 12.34 కోట్లకు చేరుకుంది. వీరిలో 10 కోట్ల మంది చెల్లింపు వినియోగదారులు కావడం గమనార్హం. కాగా, జియో వినియోగదారులు నెలకు 125 కోట్ల జీబీని వాడేస్తున్నారు. రోజుకు 250 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు జియో పేర్కొంది. అలాగే నెలకు 165 కోట్ల గంటల పాటు వీడియోలను వీక్షిస్తున్నారు. దేశంలోని ఇతర టెల్కోల వినియోగదారులు ఉపయోగిస్తున్న మొత్తం వీడియో స్ట్రీమింగ్‌కు ఇది ఐదురెట్లు ఎక్కువని జియో పేర్కొంది.

  • Loading...

More Telugu News