: కొందరు హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ వాడుతారు.. పబ్బుల్లో డ్రగ్స్ మామూలే!: సిట్ విచారణలో నవదీప్ వెల్లడి!


డ్రగ్స్ దందాలో యువ నటుడు నవదీప్ విచారణ సందర్భంగా బయటపడిన విషయాలు టాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కొత్త విషయాలను నవదీప్ సిట్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. సినీ రంగంలో డ్రగ్స్ గుట్టుచప్పుడు కాకుండా ఎలా నడుస్తాయన్న విషయాన్ని నవదీప్ బయటపెట్టినట్టు సమాచారం. కొందరు అగ్రహీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తనకు తెలుసని సిట్ విచారణలో నవదీప్ తెలిపాడు.

అంతేకాదు, డ్రగ్స్ తీసుకునే హీరోలు, హీరోయిన్ల పేర్లను నవదీప్ సిట్ కు వెల్లడించినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఉన్న హీరోలు డ్రగ్స్ కు బానిసలయ్యారని నవదీప్ సిట్ కు తెలిపాడు. దీంతో నవదీప్ సిట్ విచారణలో ఎవరి పేర్లు చెప్పాడు? అనే టెన్షన్ టాలీవుడ్ లో పెరిగిపోతోంది. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని, సిట్ ఎవరికి సమన్లు పంపుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, హైదరాబాదులోని పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం సర్వసాధారణమని నవదీప్ 'సిట్' విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే వారి కోసం పబ్బుల్లో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని కూడా వెల్లడించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News