: అకున్ సబర్వాల్ కు భద్రత మరింత పెంచుతాం: తెలంగాణ హోం మంత్రి నాయిని


డ్రగ్స్ వ్యవహారంలో ఇటీవల బెదిరింపు కాల్స్ అందుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు భద్రతను మరింత పెంచుతామని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. దిగ్విజయ్ దిగజారి మాట్లాడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక మాఫియా ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నాయిని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News