: నా లవ్ ప్రపోజల్ కు 'భానుమతి' ఇచ్చిన సమాధానం ఇదీ!: హీరో వరుణ్ తేజ్


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ఫిదా. ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో చిత్ర యూనిట్, వరుణ్ తేజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిదా చిత్రంలోని ఓ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వరుణ్ తేజ్ ఓ ట్వీట్ తో పాటు ఓ చెప్పు ఫొటోను పోస్ట్ చేశాడు. ‘వరుణ్ తేజ్ క్రేజీగా ఫీలయ్యేలా భానుమతి ఇచ్చిన రిప్లై ఇదే’ నంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా, ఈ చిత్రంలో సాయిపల్లవికి వరుణ్ తేజ్ తన లవ్ ను ప్రపోజ్ చేస్తే.. చెప్పు ఫొటోను మెస్సేజ్ రూపంలో పంపి సాయిపల్లవి రిప్లై ఇస్తుంది. ఈ సీన్ కు థియేటర్లో ప్రేక్షకుల చప్పట్లతో మార్మోగిపోయిందని అభిమానులు చెబుతున్నారు. ఇకపై, లవ్ ప్రపోజ్ చేస్తే ‘చెప్పు’ ఫొటో ద్వారానే రిప్లైలు పంపిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు షేర్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
కాగా, ‘ఈ సినిమాలో వరుణ్ తేజ్ సెకండ్ హాఫ్ ఇరగదీశారు. సూపర్బ్ యాక్టింగ్. పవన్ కల్యాణ్ బాబాయిలా మీరు కచ్చితంగా పైకొస్తారు..’,
‘అప్పట్లో ఖుషీ, ఇప్పట్లో ఫిదా’,
‘ఫిదా అయిపోయాం అన్న. లవ్ యూ అన్నా..’ అంటూ నెటిజన్లు ప్రశంసించారు.

  • Loading...

More Telugu News