: రాతపూర్వకంగా అనుమతి ఇచ్చిన తర్వాతే శాంపిల్స్ సేకరిస్తున్నాం: అకున్ సబర్వాల్


డ్రగ్స్ వ్యవహారంలో విచారణకు వచ్చిన వారి నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకున్న తర్వాతే వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జానీ జోసెఫ్ సహా 19 మందిని అరెస్టు చేశామని, ప్రతిరోజూ నలుగురు సభ్యుల బృందం విచారణ చేపడుతోందని చెప్పారు.

డిపార్ట్ మెంట్ పరంగా అందరినీ సమానంగా చూస్తున్నామని, విచారణను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నామని, ఈ వీడియో ఫుటేజ్ ను కోర్టు ముందు ప్రవేశపెడతామని చెప్పారు. నార్కోటిక్స్, నిఘా వర్గాల వారితో కలిసి పనిచేస్తున్నామని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఎక్కడా ఉల్లంఘించలేదని, ఇద్దరు తారలకు గైడ్ లైన్స్ ప్రకారమే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కొనడం, అమ్మడం, వాడడం, అలవాటు చేయడం, ఇంట్లో పెట్టుకోవడం నేరమని చెప్పారు.

  • Loading...

More Telugu News