: ఓ వర్గాన్నే టార్గెట్ చేశామనడం సబబు కాదు: చంద్రవదన్
డ్రగ్స్ వ్యవహారంలో ఓ వర్గాన్నే టార్గెట్ చేస్తున్నామనడం సబబు కాదని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అన్ని రంగాలకు చెందిన వారిని విచారిస్తున్నామని, ఇప్పటివరకు 27 మందిని ప్రశ్నించామని,19 మందిని అరెస్టు చేశామని చెప్పారు. చట్టానికి లోబడే విచారణ జరుగుతోందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. విచారణ నిమిత్తం ఇతర శాఖల అధికారులను కూడా సంప్రదిస్తున్నామని, తమకు లీగల్ టీమ్ కూడా సాయపడుతోందని అన్నారు.