: డ్రగ్స్ కేసులో హీరోయిన్ కాజల్ మేనేజర్ అరెస్ట్!
ప్రముఖ హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు రోనీని అదుపులోకి తీసుకున్నారు. మణికొండలోని ఆయన ఇంటిపై దాడి చేసిన పోలీసులు... ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాను గంజాయిని వాడుతున్నట్టు రోనీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, చాలా కాలంగా రోనీ డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోనీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, అన్ని విషయాలు బయటపడతాయని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. గతంలో హీరోయిన్లు రాశిఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా రోనీ మేనేజర్ గా పని చేశాడు.