: కొత్త అనుమానాలు... సిట్ అధికారులు బలవంతంగా రక్తాన్ని తీసుకుంటున్నారా?


తమ వద్దకు విచారణకు వచ్చిన సినీ ప్రముఖుల నుంచి సిట్ అధికారులు బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారా? నార్కోటిక్స్ చట్టాన్ని అతిక్రమిస్తూ, వారి నుంచి అనుమతి తీసుకోకుండా వీటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపుతున్నారా? నేడు చార్మీ హైకోర్టును ఆశ్రయించిన తీరును చూస్తుంటే, అవుననే అనిపిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పూరీ, సుబ్బరాజు, తరుణ్ లు తమ రక్త నమూనాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరు స్వచ్ఛందంగా నమూనాలను ఇచ్చి వుంటే, తమ అనుమతితోనే వాటిని తీసుకున్నారన్న విషయం చార్మీకి తప్పకుండా తెలిసిపోయి ఉంటుందనేది వారి వాదన. వీరిలో ఎవరో ఒకరి నుంచి నమూనాలను బలవంతంగా తీసుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న చార్మీ, వాటిని ఇవ్వడం ఇష్టం లేకనే హైకోర్టును ఆశ్రయించినట్టు కొత్త వాదన తెరపైకి వస్తోంది. తాజా పరిణామాలు ఈ కేసును మరో కీలక మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News