: ఛార్మి గురించి స్పందించని అకున్ సబర్వాల్!


జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో డ్రగ్స్ వినియోగం, సాగు వంటి విషయాలతో పాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పాల్గొనే విషయంపై మాట్లాడామని తెలిపారు. డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. విచారణ మధ్యలో దాని గురించి మాట్లాడడం సరికాదని తెలిపారు. సినీ నటి ఛార్మీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రశ్నించగా, ఆయన దానిని పట్టించుకోలేదు. దీంతో వారిని విచారించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. కాగా, ఛార్మీ, ముమైత్ లను విచారించేందుకు సమర్థులైన మహిళా అధికారిణులను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News