: పులుల్లా పోరాడారు: భారత మహిళా క్రికెట్ జట్టుకు తారక్ ప్రశంస
ఐసీసీ ప్రపంచ మహిళా వరల్డ్ కప్ క్రికెట్‌లో విజయం దక్కించుకోకపోయినా, అత్యద్భుత ప్రదర్శన కనబరిచారని భారత మహిళా జట్టును నటుడు జూనియర్ ఎన్టీఆర్ పొగిడాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `గెలుపోటములు ద్వితీయ ప్రాధాన్యం. పోరాడామా? లేదా? అనే విషయమే లెక్కలోకి తీసుకోవాలి. భారత మహిళలు పులుల్లా పోరాడి మా హృదయాలు గెల్చుకున్నారు` అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం `జై లవ కుశ` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, వారాంతాల్లో బిగ్‌బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే!